టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గాల్లో తిరువూరు కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి అదృష్టం చాలా తక్కువ. పార్టీకి బలం ఉన్నా, బలమైన కార్యకర్తలు ఉన్నా, గెలిచే అవకాశాలు ఉన్నా సరే..చేజాతులా ఓడిపోవడం టీడీపీకి అలవాటైన ప్రక్రియ. 1999 ఎన్నికల తర్వాత నుంచి తిరువూరులో అదే జరుగుతుంది. ఇక్కడ చివరిగా 1999 ఎన్నికల్లోనే గెలిచింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది.
అయితే ఇందులో పలుమార్లు గెలుపు దగ్గరకొచ్చే టీడీపీ ఓడిపోయింది. ఇలా దగ్గరకొచ్చి టీడీపీ ఓడిపోవడానికి కారణం టీడీపీ నేతలే. వారి ఆధిపత్య పోరు, ఒకరికొకరు ఐక్యంగా పనిచేయడం ఉండదు. దాని వల్లే టీడీపీకి పెద్ద డ్యామేజ్. ఇక ఇప్పుడు కూడా తిరువూరులో అదే పరిస్తితి ఉంది. ఇక్కడ వరుసగా రెండు సార్లు గెలిచిన రక్షణనిధికి పెద్ద పాజిటివ్ ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ శ్రేణులు బాగా కసిగా ఉన్నాయి.
కానీ ఇక్కడ నాయకుల మధ్య మాత్రం సమన్వయం లేదు. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఇక్కడ జవహర్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సొంత స్థానం కొవ్వూరుపై ఫోకస్ పెట్టారు. దీంతో తిరువూరులో కొన్ని రోజుల పాటు ఇంచార్జ్ లేరు. తర్వాత ఎన్ఆర్ఐ అయిన దేవదత్ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన ఇంచార్జ్ గా నియోజకవర్గంలో బాగానే కష్టపడుతున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు.
కానీ ఓ వ్యూహం అంటూ లేకుండా వెళుతున్నారు. ప్రజలని ఎలా ఆకర్షించాలనే ఫార్ములా లేదు . ఏదో గుడ్డిగా ముందుకెళుతున్నారు. అదే సమయంలో ఈ సీటులో వాసం మునయ్య కూడా గట్టిగానే పనిచేస్తున్నారు. ఈయన కూడా సీటు ఆశిస్తున్నారు. దీంతో సీటుపై క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టీడీపీ రెండుగా చీలింది. ఇక ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరిస్తారో లేదో తెలియడం లేదు. మళ్ళీ అటు తిప్పి, ఇటు తిప్పి తిరువూరులో టీడీపీని ఓడించేలా ఉన్నారు.