నాలో ఆ కసి ఇంకా తగ్గలేదు అంటున్న తమన్నా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో మిల్కీ బ్యూటీగా కూడా పేరుపొందింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరే అదే క్రేజ్ తో బాగా దూసుకుపోతోంది తమన్నా. తాజాగా గుర్తుందా శీతాకాలం సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పలు మీడియాలతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. తమన్నా మాట్లాడుతూ.. జయాపజయాలని నేనెప్పుడూ సమానంగానే చూస్తాను. అయితే వ్యక్తిగత విజయాల కన్నా పరాజయల నుంచి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటానని తెలియజేసింది.

Tamannaah Bhatia gives fans a sneak peek of her Friday workout & it's bound  to leave you inspired; Watch | PINKVILLAదీంతో పెద్ద హీరో ,చిన్న హీరో అనే లెక్కలను నేను ఏ రోజు వేసుకోలేదని తెలియజేస్తుంది. నేను ఎవరితో నటించిన సినిమాను సినిమాలాగానే చేస్తానని తెలియజేసింది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూశాక సత్యదేవతో నటిస్తే బాగుంటుందని అనిపించిందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అలా వచ్చిన అవకాశమే గుర్తుందా శీతాకాలమని తెలియజేస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి చాలా ఏళ్లు అవుతోందని అనుకోలేదు.. ఇన్నాళ్లుగా ఇక్కడున్న సినిమాలపై నాకున్న ప్రేమ కసి ఏమాత్రం ఇంకా తగ్గలేదని తెలియజేస్తోంది. సినిమాలలోకి వచ్చిన మొదటి రోజుల్లో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను నటిగా మంచి పాత్రలు చేస్తూనే ఉన్నానని తెలియజేస్తోంది.

రాబోయే రోజులలో నిర్మాతగా మారాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలియజేస్తోంది. ఇన్ని రోజులు కూడా ఇక్కడ ఉన్నాను అంటే అందుకు కారణం నేను ఎప్పుడు స్టార్ హీరోయిన్గా ఊహించుకోలేదని.. నన్ను ఒక మంచి నటిగానే ప్రేక్షకులు చూసుకున్నారని అదే నా లాంగ్ వర్క్ లైఫ్ కి కారణమైందని తెలియజేసింది. అంతేకాకుండా ఏ చిత్రంలోనైనా సరే తనకు ప్రాధాన్యత తక్కువగా ఉన్న ఆ పాత్ర బాగా అనిపిస్తే చేస్తానని తెలియజేస్తుంది.