పది భాషలలో విడుదలవుతున్న సూర్యచిత్రం..!!

కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన సూర్య ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. జాతీయ అవార్డుల సైతం అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాల సత్తా చాటుతున్నాడు సూర్య. ఇక సూర్యకు తోడుగా తన భార్య జ్యోతిక కూడా తనకి సహాయంగా నిలుస్తూ ఉంటుంది. అన్ని భాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అందుకున్నాడు సూర్య. ఇప్పటికే తన చిత్రాలను కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకేసారి విడుదల చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్గా విక్రమ్ సినిమా లో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర మరింత హైప్ ని పెంచింది.

Suriya 42: Actor's next with director Siva hints of a periodic action 3D  film; WATCH engaging motion poster | PINKVILLAఇప్పుడు ఒక స్వతంత్ర సినిమాని చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సూర్య, లోకేష్ కనకరాజు వంటి క్రియేటివ్ డైరెక్టర్ తో సూర్య రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే అంతకన్నా ముందే సూర్య తన 42వ చిత్రాన్ని ఏకంగా పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పీరియాడిక్ డ్రామా చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ గోవా, చెన్నై వంటి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. నిన్నటి రోజున తాజా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా దిశాపటాన్ని నటిస్తోంది. సూర్య సరసన నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో తాను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఈ చిత్రం 3D ఫార్మాట్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా లెవెల్లో చిత్రాలను విడుదల చేయడంతో ఈ చిత్రాన్ని కూడా రేంజ్ లో విడుదల చేస్తున్నారు మరి ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.