అందాల భామ శ్రుతి హాసన్ కెరీర పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే శ్రుతిహాసన్ వయసు 36 ఏళ్ళు. అయితే నాలుగు పదుల వయసుకు చేరవవుతున్న ఈ అమ్మడు పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపడం లేదు.
తాజాగా ఈ బ్యూటీ వివాహం పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడకు వెళ్లినా తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని, అలా అడగటం చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నదని చెప్పింది శృతిహాసన్. అసలు తనకు మరో రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేసింది. దీంతో శ్రుతిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అదేంటి శ్రుతి అంత మాటనేశావ్.. ముసలిదానివి అయ్యాక పెళ్లి చేసుకుంటావా ఏంటి..? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. కాగా, శ్రుతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయణం నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఒకే ఇంటిలో ఉంటూ లివింగ్ రిలేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండేళ్లకు పైగా శృతి-శాంతను రిలేషన్ కొనసాగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ వీడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.