మహేష్ బాబు వ్యాపారాల గురించి తెలిస్తే కళ్ళు బయర్లు గమ్మటం ఖాయం..!

ప్రస్తుతం ఉన్న హీరోలలో కేవలం సినిమాలలోనే కాకుండా ఇతర వ్యాపార రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు హీరోలు. ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. మహేష్ బాబు తన కెరియర్ ఆరంభం నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ సరికొత్త ఆలోచనలతో ఇటు సినిమాలో మరోవైపు వ్యాపారంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా సినిమాలలోకి వచ్చిన మహేష్.. తన నటనతో తండ్రి అభిమానులతో పాటు ఎందరో అభిమానులను పొంది. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.

business investments of mahesh babu on Namrata Ghattamaneni

ఇక మహేష్ సినిమాలలో నెంబర్ వన్ గా ఉన్న ఇప్పుడు బిజినెస్ లో కూడా తన ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బుతో బిజినెస్ లను మొదలుపెట్టి మిగతా వారి కంటే భిన్నంగా ముందుకు వెళ్తున్నాడు. ఇక అయితే మహేష్ బాబు మొదలుపెట్టిన ఈ వ్యాపారాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.

*జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. సూపర్ స్టార్ మహేష్ జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఈ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

AMB Cinemas - Know About Ticket Price, Seating Capacity And The Ambiance
*ఏఎంబీ సినిమాస్.. మహేష్ ఏషియన్ సంస్థతో కలిసి హైదరాబాదులో భారీ మల్టీప్లెక్స్ ను కూడా స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. మహేష్ స్టార్ట్ చేసిన ఏఎంబి సినిమాస్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ లో ఒకటి.

*ది హంబుల్ కో.. మహేష్ రీసెంట్ గా వస్త్ర రంగంలో కూడా అడుగు పెట్టారు. హంబుల్ కో అనే బ్రాండ్ తో దుస్తులను మార్కెట్లో దింపుతున్నారు. ప్రస్తుతం దుస్తులకు ఎంతో డిమాండ్ కూడా ఉంది.

Mahesh Babu ventures in another new business two days before his 44th  birthday - IBTimes India

*AN హోటల్.. ఇక మహేష్ బాబు హోటల్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టి ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఏఎన్ హోటల్ ను స్టార్ట్ చేశాడు. ఈ హోటల్ ను తాజాగా ప్రారంభించగా ఈ హోటల్‌కు తన భార్య అయిన నమ్రత పేరు పెట్టాడు.

*ప్యాలెస్ హైట్స్.. మహేష్ బాబు వీటితో పాటు త్వరలోనే మినర్వ కాఫీ షాప్ తో కలిసి ప్యాలెస్ హిట్స్ అనే రెస్టారెంట్ ని కూడా మొదలు పెడతారని తెలుస్తుంది.