మహేష్ కోసం ‘అ’ సెంటిమెంట్ నమ్ముకున్న త్రివిక్రమ్.. హిట్ కొడతాడా లేదా..!

టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో.. ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చింది. డిసెంబర్ 8 నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టనన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది.

అప్డేట్ ఏమిటంటే త్రివిక్రమ్ ఏ హీరో తో సినిమా చేసిన వాటిలో కామన్ గా ఉండే కొన్ని పాయింట్స్ ఉంటాయి. హీరోకి ఎక్కువ స్కోప్ ఎవడు, విలన్ చనిపోడు, మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఒక రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితోపాటు కామన్ గా ఉండే మరో పాయింట్.. త్రివిక్రమ్ తన సినిమాలకు ఎక్కువగా ‘అ’ తో వచ్చే పేర్లనే టైటిల్ గా పెట్టుకుంటాడు. అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురములో.. ఇక ఇలా త్రివిక్రమ్ ఆ టైటిల్‌తో తీసినన సినిమాలలో అజ్ఞాతవాసి తప్ప మిగిలిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.

Watch Athadu Full Movie Online in HD Quality | Download Now

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను మహేష్ తో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 28వ‌ సినిమాకు కూడా అ అక్షరంతో టైటిల్ పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమాకు ”అసుర సంధ్యా వేలా” అనే టైటిల్ ని కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ పెట్టే సినిమా టైటిల్స్ కూడా ఎంతో అర్థం ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా పేరు కూడా ఎంతో గొప్ప అర్థం ఉంది. ఇక అసుర సంధ్య వేలా అంటే…. రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుని దగ్గర నుంచి అమితమైన శక్తులను పొంది.. అందులోనూ తనను పగటిపూట కానీ, రాత్రిపూట కానీ, మనిషి కానీ, మృగం కానీ, ఆయుధం కానీ, ఇంటి బయట కానీ తనను ఎవరు చంపకూడదనే వరం పొందాడు.

Is Mahesh-Trivikram's project Athadu sequel? | cinejosh.com

ఈ వరం కారణంగా హిరణ్యకశిపుని ఎవరు చంప లేకపోవడంతో.. శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి.. పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో హిరణ్యకశిపుని అంతం చేశాడు.. పగలు అంతమై రాత్రి మొదలయ్యే సమయంలో వచ్చే సమయాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ సంధ్య కాలంలోనే అసుర సంహారం జరిగింది కాబట్టి దీన్ని ‘అసుర సంధ్యా వేలా’ అంటారు. ఇప్పుడు ఇలాంటి ఎంతో గొప్ప అర్థం చెప్పే ఎలిమెంట్ ను తీసుకుని టైటిల్ గా మహేష్ సినిమాకు పెట్టాడు త్రివిక్రమ్. తనకు కలిసి వచ్చిన ఈ సెంటిమెంటుతో మహేష్ కు హిట్ ఇస్తాడో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.