క్రిస్మస్ విన్నర్ గా `ధమాకా`.. 4 రోజుల్లో దుమ్ము దుమారం రేపిందిగా!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిపోయి క్రిస్మ‌స్ విన్న‌ర్ గా నిలిచింది. ఫ‌స్ట్ వీకెండ్ లో రూ. 15.37 కోట్ల రేంజ్ లో షేర్ చేసుకున్న ఈ చిత్రం.. 4వ రోజు వ‌ర్కింగ్ డే అయిన‌ప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.13 కోట్లు రాబ‌ట్టి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 3.55 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక ఏరియాల వారీగా ధ‌మాకా మూడు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 7.51 కోట్లు
సీడెడ్: 2.84 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.04 కోట్లు
తూర్పు: 88 ల‌క్ష‌లు
పశ్చిమ: 71 ల‌క్ష‌లు
గుంటూరు: 1.06 కోట్లు
కృష్ణ: 95 ల‌క్ష‌లు
నెల్లూరు: 51 ల‌క్ష‌లు
———————————————-
ఏపీ+తెలంగాణ‌= 16.50 కోట్లు(29.65 కోట్లు~ గ్రాస్)
———————————————-

క‌ర్ణాట‌క+రెస్టాఫ్ ఇండియా : 1.40 కోట్లు
ఓవ‌ర్సీస్ : 1.02 కోట్లు
—————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 18.92 కోట్లు(35.20 కోట్లు~ గ్రాస్)
—————————————–

కాగా, రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే రూ. 18.92 కోట్లు రాబ‌ట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆల్మోస్ట్ అందుకున్న ఈ సినిమా 5వ రోజు కలెక్షన్స్ తో క్లీన్ హిట్ గా నిలిచి లాభాల బాట ప‌ట్ట‌డం ఖాయ‌మైంది.