కెమెరా వెనుక అలాంటి పనులు చేస్తేనే కోట్లు : తాప్సి..!!

సినీ ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా ఎప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించలేము. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ మీద ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. కమిట్మెంట్ విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటే మరి కొంతమంది దాన్ని కమిట్మెంట్ గా పిలుస్తూ ఉంటారు. హీరోలకు దర్శక నిర్మాతలకు కొంతమంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తూ ఉంటారని వార్తలు ఎంతోమంది నటీమనులు సైతం తెలియజేస్తూ ఉంటారు.

830 Taapsee pannu ideas | taapsee pannu, bollywood actress, indian actressesతాజాగా టాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఈమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచెలా చేస్తోంది. చాలామంది కెమెరా ముందు నటించడం ఒకలాగా ఉంటుంది. కెమెరా వెనక నటించడం ఇంకొకలాగా ఉంటుందని తెలుపుతోంది. కెమెరా ముందు కనిపించినంతమాత్రాన వాళ్లు మంచివాళ్లు అని అనుకోలేము.. తెరవెనకు ఏం జరుగుతుందో చాలామందికి తెలియకపోవచ్చు .అంటూ బాబు పేల్చింది తాప్సి. తాప్సి ఎలాంటి విషయాన్ని అయినా సరే డైరెక్ట్గా చెప్పేస్తుందని చెప్పవచ్చు.

ఇలా డైరెక్ట్ గా మాట్లాడటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది.. తాను కెమెరా ముందు మాత్రమే నటించగలను తెరవెనుక నటించడం నావల్ల కాదు..నాకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అలవాటు ఉంది. అయితే వెనుక నటించేవాళ్లే ఇండస్ట్రీలో ముందు వరుసలో ఉంటారు. వాళ్లకి ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా నటించే వారే కోట్లు సంపాదిస్తూ ఉంటారని తెలియజేస్తోంది. తెర వెనుక నటించే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఇమే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాప్సి ఒక స్టార్ హీరోయిన్ గురించి ఇన్ డైరెక్ట్ గా ఇలా కామెంట్లు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.