ఆ మంత్రి వారసుడుకు సీటు ఫిక్స్..కానీ.!

గడపగడపకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంచార్జ్‌లు ఖచ్చితంగా తిరగాల్సిందే అని, వారసులు తిరిగితే దాన్ని కౌంట్ చేయమని చెప్పి జగన్ ఇప్పటికే పలు వర్క్ షాపుల్లో చెప్పిన విషయం తెలిసిందే.  అలాగే వారసులకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడున్న వాళ్ళే మళ్ళీ తనతో ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి రావాలని చెప్పి జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాటలని కొందరు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

కొందరు ఆరోగ్య రీత్యా, మరికొందరు వయసు రీత్యా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు. ఇప్పటికే పోటీ చేయలేమని చెప్పేశారు. తమ బదులు తమ వారసులకు సీటు ఇవ్వాలని జగన్‌ని కోరుతున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలు పేర్ని నాని, చెన్నకేశవ రెడ్డి లాంటి వారు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి ..తమ వారసులని పోటీకి దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే వారి వారసులు గడపగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఇదే సమయంలో మంత్రి పినిపే విశ్వరూప్ సైతం నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని అంటున్నారు. ఇటీవలే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక మంత్రిగా తన శాఖ పరమైన పనులు చేయడంలో కూడా విశ్వరూప్ వెనుకబడి ఉన్నారు. అటు గడపగడపకు కార్యక్రమాన్ని తన రెండో కుమారుడు శ్రీకాంత్ చేస్తున్నారు. అయితే మొదట కుమారుడు కృష్ణారెడ్డి రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఆ మధ్య అమలాపురం అల్లర్లు సమయంలో కృష్ణారెడ్డి కాస్త వివాదాల్లో చిక్కుకున్నారు.

దీంతో కృష్ణారెడ్డి సీటు ఇస్తే కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురు కావచ్చు. అందుకే శ్రీకాత్‌కు సీటు ఇస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ గడపగపడకు తిరుగుతున్నారు. ఇక అమలాపురం ఎంపీ  చింతా అనురాధా వచ్చే ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు అసెంబ్లీ ఇస్తే..ఎంపీ సీటుకు విశ్వరూప్ తనయుడ్ని నిలబెట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి విశ్వరూప్ మాత్రం ఈ సారి పోటీకి దూరం కానున్నారు.