ముఖం చాటేస్తున్న టాలీవుడ్ హీరోలు.. ఇక పూరీకి ఆ బాలీవుడ్ న‌టుడే దిక్కా?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి కం బ్యాక్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను `లైగర్` ఊహించని దెబ్బ కొట్టింది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. వాస్తవానికి లైగ‌ర్ అనంతరం పూరీ జగన్నాథ్‌ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ను విజయ్ దేవరకొండ తో చేయాల్సి ఉంది.

లైగ‌ర విడుదలకు ముందే ఈ ప్రాజెక్టును ముంబైలో ప్రారంభించారు. పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ లైగ‌ర్‌ ఫలితంతో ఈ ప్రాజెక్టు మరుగున పడింది. దీంతో పూరీ నెక్స్ట్ ఏ హీరోతో ఉండబోతోంద‌న్నది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి, రవితేజ వంటి హీరోల పేర్లు వినిపించినా.. ఎవరు ఇంకా ఫైనల్ కాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. దాదాపు టాలీవుడ్ హీరోలందరూ పూరీకి ముఖం చాటేస్తున్నారట.

దీంతో పూరీ టాలీవుడ్ హీరోల‌ను ప‌క్క‌న పెట్టి ఓ బాలీవుడ్ స్టార్ హీరోను న‌మ్ముకున్నాడ‌ని టాక్‌ నడుస్తోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. రీసెంట్గా ఓ కొత్త కథతో పూరీ జగన్నాథ్‌ సల్మాన్ ఖాన్ ను కలిసాడ‌ట‌. కథ నచ్చడంతో ఆయన వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే వీరి కాంబో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

Share post:

Latest