చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ బ్లాక్ బస్టర్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకొని ఓవర్ నైట్ కే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. మగధీర సినిమా నటించిన తర్వాత రామ్ చరణ్ కు మళ్ళీ అంతటి గుర్తింపు తెచ్చిన సినిమా ఏమిటంటే రంగస్థలం అని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా వచ్చిన RRR సినిమాతో బాగా ఎంజాయ్ గా కూడా మారారు. హీరో అన్న తర్వాత ఎన్నో కథలు వింటూ ఉంటారు కొన్ని నచ్చితే చేస్తారు నచ్చకపోతే రిజెక్ట్ చేయడం వంటివి జరుగుతూ ఉంటుంది.

Darling movie WP | Darling movie, Prabhas pics, Cute love couple imagesఅయితే అలా రిజెక్ట్ చేసిన ఒక హీరో కథతో మరొక హీరో సూపర్ హిట్ అందుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలా రామ్ చరణ్ కెరియర్లో కూడా ఒక సినిమా ఉన్నది. అదే కథ తో ప్రభాస్ నటించిన మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ సినిమాను రామ్ చరణ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా ఏదో కాదు ప్రభాస్ నచ్చనించిన లవ్ స్టోరీ చిత్రం డార్లింగ్. మొదట ఈ సినిమా కథ రామ్ చరణ్ వద్దకే వెళ్లిందట.

కానీ రామ్ చరణ్ లవ్ స్టోరీ అని అన్నట్లుగా పక్కన పెట్టేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. దాంతో ఈ సినిమా ప్రభాస్ కథ వినగానే ఓకే చెప్పడం జరిగిందట. దీంతో ఈ సినిమా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఇక ఈ సినిమా నుంచే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సినిమా రామ్ చరణ్ చేసి ఉంటే ప్రభాస్ కు డార్లింగ్ అనే పేరు వచ్చి ఉండేది కాదేమో.