మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ నుంచి బుట్ట‌బొమ్మ ఔట్‌.. ఇదిగో క్లారిటీ!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ ఇంట్లో వ‌రుస విషాదాలు నెలకొన్నాయి. అయితే మహేష్ ఈ విషాదాల నుంచి చాలా త్వ‌ర‌గా కోలుకొని షూటింగ్‌ సిద్ధమయ్యాడు. కానీ పూజా హెగ్డే రెడీగా లేదు. ఆమె కాల్ కి గాయం కావడం వల్ల గత కొద్ది రోజుల నుంచి షూటింగ్స్ కు దూరంగా ఉంటుంది.

దీంతో పూజా హెగ్డే కారణంగా మహేష్ సినిమా మరింత ఆలస్యం అవుతోందని టాక్ న‌డించింది. ఈ కార‌ణంగానే సినిమా నుంచి త్రివిక్రమ్ ఆమెను తప్పించార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంలో తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారం అవాస్త‌వం అట‌. పూజ హెగ్డే షూటింగ్ లో జాయిన్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. డిసెంబర్ 15 నుంచి ఆమె షూటింగ్ లో భాగం కానుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీ `స‌ర్క‌స్‌` ప్ర‌మోష‌న్స్ బిజీగా ఉన్న పూజ.. త్వరలో హైదరాబాద్ రానున్నారు.

Share post:

Latest