తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది హీరోలు వరుసగా విజయాలు అందుకుంటూ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలు ఒక్క సినిమా హిట్టు కొట్టడం అనేది చాలా గగనంగా మారిపోయింది.ఇలాంటి సమయంలో కూడా వరుసగా మూడు హీట్లను సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్టుని అందుకోవడం అంటే అది ఆశ మాస విషయం కాదు. అయితే ఇప్పుడు ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఇలా హ్యాట్రిక్ హిట్లని దక్కించుకోవడం అభిమానులకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇలా డబుల్ హ్యాట్రిక్ హిట్టును అందుకున్న హీరోలలో ఎన్టీఆర్, నాని, అడవి శేషు ఉన్నారని తెలుస్తోంది.
హీరోలు వరుసగా రెండు హిట్ల ను సొంతం చేసుకోవడానికి చాలా సతమతమవుతున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు హీరోలు మాత్రం 6 సినిమాలు వరసగా సక్సెస్ సినిమాలను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ దమ్ము ,రభస వంటి సినిమాలు పరాజయం తర్వాత టెంపర్, నాన్నకు ప్రేమతో ,జనతా గ్యారేజ్ ,లవకుశ ,అరవింద సమేత, RRR వంటి చిత్రాలతో వరుసగా 6 విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.
ఇక నాచురల్ స్టార్ నాని విషయానికి వస్తే పైసా, జెండాపై కపిరాజు వరకు ప్లాపులను చవిచూశారు. అటు తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, జెంటిల్మెన్ ,మజ్ను, నేను లోకల్ వంటి సినిమాలతో వరుసగా ఆరు విజయాలను అందుకున్నారు. ఇక వీరిద్దరి తర్వాత మరొక యంగ్ హీరో అడవి శేషు కూడా మంచి విజయాలను అందుకున్నారు. క్షణం, గూడచారి, ఎవరు, అమితుమీ మేజర్ ,హీట్ -2 వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఇలా ఆరు సినిమాలను వరుసగా విజయాలను అందుకొని డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.