దారుణంగా మారిన `లైగ‌ర్‌` భామ‌ ప‌రిస్థితి.. రెమ్యునరేషన్ త‌గ్గించిన లాభం లేద‌ట‌!?

`లైగ‌ర్‌`.. ఈ ఏడాది భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుందో తెలిస్తే. బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచిన ఈ సినిమా.. అంద‌రి స‌ర‌దా తీర్చేస్తుంది. సినిమా ఫైనాన్సుకు సంబంధించి ఇప్పటికే పూరీ, ఛార్మీలతో పాటు హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ దర్యాప్తు చేసింది. వీళ్ల కష్టాల్లో వీళ్లుంటే.. `లైగ‌ర్‌` లో హీరోయిన్ గా న‌టించిన బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే ప‌రిస్థితి సైతం దారుణంగా మారింది.

లైగర్ సినిమా తన లైఫ్ ను మార్చేస్తుంద‌ని భావించిన అన‌న్య‌కు కోలుకోని దెబ్బ త‌గిలింది. ఈసినిమా ప్లాప్ లో మేజర్ షేర్‌ను అన‌న్య పైనే తోసేసి ట్రోల్ చేశారు. పైగా ఈ సినిమా త‌ర్వాత అన‌న్య‌కు అవ‌కాశాలే క‌రువ‌య్యాయ‌ట‌. గతంలో కమిట్ అయిన రెండు మూడు సినిమాలు తప్పించి.. లైగ‌ర్ విడుద‌ల త‌ర్వాత ఒక్క ప్రాజెక్ట్ కు అన‌న్య సైన్ చేయ‌లేద‌ట‌.

ఎంతగా ప్రయత్నిస్తున్నా.. మేకర్స్ మాత్రం ఆమెకి ఛాన్సులు ఇవ్వడానికి రెడీగా లేరని బీటౌన్ లో జోరుగా టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అన‌న్య రెమ్యున‌రేష‌న్ కూడా త‌గ్గించుకుంద‌ట‌. లైగ‌ర్ కు ముందుకు ఒక్కో సినిమాకు రూ. 80 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేసే అన‌న్య.. రీసెంట్ గా రూ. 50 ల‌క్ష‌లకు త‌గ్గింద‌ట‌. అయినా లాభం లేద‌ని అంటున్నారు. ముందు ముందు కూడా ఇలానే పరిస్థితి ఉంటే.. అన‌న్య కెరీర్ డేంజ‌ర్ జోన్ లో ప‌డిన‌ట్టే.

Share post:

Latest