తంబళ్ళపల్లెపై నల్లారి గురి..రెండో సీటు దక్కేనా!

టీడీపే చేతులారా నష్టపోతున్న నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లె కూడా ఒకటి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న ఈ సీటులో సరైన నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇక్కడ ఉన్న టీడీపీ నేత శంకర్ యాదవ్ అనుకున్న విధంగా పనిచేయడంలో విఫలమవుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పార్టీలో గాని, నియోజకవర్గంలో గాని కనిపించలేదు.

దీంతో ఇంచార్జ్‌ని మార్చడానికి చంద్రబాబు చూస్తుండగా శంకర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి..ఈ సారి బాగా పనిచేస్తానని తనని మార్చవద్దని చెప్పుకొచ్చారు. దీంతో బాబు మరొక అవకాశం ఇచ్చారు. అయినా సరే శంకర్‌లో మార్పు రాలేదు. అసలు నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు. వైసీపీపై పోరాటం లేదు. అటు టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. అందుకే శంకర్‌ని మార్చాలని చెప్పి అక్కడ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే తంబళ్ళపల్లె విషయంలో బాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు . ఇక ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఈ సీటుపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫోకస్ చేశారని తెలిసింది. తాను ఎలాగో పీలేరు బాధ్యతలు చూసుకుంటున్నారు. తన వారసుడుకు తంబళ్ళపల్లె సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారట.

అందుకే ఇక్కడ కూడా నల్లారి పనిచేస్తున్నట్లు తెలిసింది. కాకపోతే ఒక ఫ్యామిలీకే రెండు సీట్లు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. అటు ప్రవీణ్ కుమార్ రెడ్డిని తీసుకొస్తే..ఆయనకే సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. శంకర్ గాని ఇకనుంచి యాక్టివ్ గా ఉంటే పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది. మరి తంబళ్ళపల్లె సీటు విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.