బీసీ జపం..జగన్ సక్సెస్ అయినట్లేనా.!

అధికార వైసీపీ ఇటీవల బీసీల జపం ఎక్కువ చేస్తుంది..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటినుంచే కులాల వారీగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ప్రతి వర్గం టీడీపీకి యాంటీగా మారడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాలని టార్గెట్ చేశారు. తాజాగా జయహో బీసీ సభని కూడా నిర్వహించారు. అయితే ఈ సభ  ద్వారా..బీసీలకు తామే ఎక్కువ చేశామని, చంద్రబాబు ఏమి చేయలేదని, బాబు బీసీలకు అన్యాయం చేశారని జగన్ చెప్పుకొచ్చారు.

బీసీలంటే వైసీపీకి వెన్నెముక అని, తెలుగుదేశం హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, తన మూడున్నరేళ్ల పాలనలో వారికి రాజ్యాధికారం వచ్చిందని, గతంలో చంద్రబాబు బీసీల తోకలు కట్‌ చేస్తానన్నారని, ఖబడ్దార్‌.. మీ అంతు చూస్తానని బెదిరించారని విమర్శించారు. అటు వైసీపీలోని బీసీ నేతలంతా చంద్రబాబుని తిట్టడం, జగన్‌కు భజన చేయడమే లక్ష్యంగా సభ జరిగింది. అయితే ఈ సభ ద్వారా..బీసీలంతా తమ వైపే ఉన్నారని జగన్ చెప్పాలని చూశారు.

బీసీల మద్ధతు మొత్తం తమకే అని చాటి చెప్పాలని భావించారు. అయితే జగన్ చెప్పడం బాగానే ఉంది..అలాగే సభకు భారీగానే ప్రజలని తరలించారు. అంతవరకు బాగానే ఉంది గాని..ఎంతమంది జగన్ చెప్పిన  మాటలని నమ్మారు అనేది మెయిన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో మెజారిటీ బీసీలు వైసీపీకే ఓటు వేశారు. అందుకే వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఒరిగింది ఏంటంటే..ఏమో అది బీసీలనే అడిగితే బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే అందరితో పాటు వచ్చే పథకాలనే జగన్ చెప్పారు. బీసీలకు ప్రత్యేకంగా చేసింది ఏంటో క్లియర్ గా చెప్పలేదు. అలాగే పేరుకు 56 కార్పొరేషన్లు పెట్టారు గాని..వాటి ద్వారా ఎంతమంది బీసీలకు సాయం అందించారనేది తెలియదు. అసలు చంద్రబాబు హయాంలో బీసీలకు ఒరిగింది ఏమి లేదని అన్నారు. అప్పుడు ఏం ఒరిగిందో లేదో బీసీలకే తెలియాలి. మొత్తానికి జగన్ చెప్పడానికి చెప్పారు గాని..అవి బీసీ ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతాయనేది క్లారిటీ లేదు.