సంక్రాంతి రెసుల్ ముందంజలో ఉండేది ఆ హీరోనేనా..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న అగ్ర హీరోల నుంచి అతిపెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి.. అలాగే విజయ్ దళపతి నటిస్తున్న వారసుడు సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి పలు రకాల విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే కేవలం ఇది స్టార్ హీరోల మధ్య కొనసాగే ఫైట్ మాత్రమే కాకుండా..ముగ్గురు తెలుగు దర్శకుల మధ్య కొనసాగే బిగ్ వార్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Veera Simha Reddy Waltair Veerayya : బాలయ్య వర్సెస్ చిరు.. అసలైన పోటీ నైజాం  లోనేనాఇంతకుముందు ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చాయి.. అందులో గోపీచంద్ మలినేని సంక్రాంతికి క్రాక్ , బలుపు ,డాన్ శీను, పండగ చేస్కో సినిమాను విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాతో వస్తున్నారు. డైరెక్టర్ బాబి గతంలో వచ్చిన నాలుగు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి. అందులో వెంకీ మామ, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతోంది.

12 బాలయ్య? 13 చిరంజీవి?మరొక డైరెక్టర్ వంశీ పైడిపల్లి దిల్ రాజ్ సపోర్టుతోనే సంక్రాంతికి నాలుగు సినిమాలను విడుదల చేశారు. అందులో మున్నా, బృందావనం, మహర్షి , ఊపిరి వంటి సినిమాలు విడుదలయ్యాయి .ఇప్పుడు విజయ్ తో వారసుడు సినిమా తీసుకురాబోతున్నారు. వీరందరిలో బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాకి హై రేంజ్ లో అందుకని అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంక్రాంతి బరిలో విన్నర్ ఎవరో అవుతారో చూడాలి మరి.

Share post:

Latest