ప్ర‌భాస్‌తో మారుతి ప్ర‌యోగం.. పాత థియేట‌ర్‌కు రూ. 10 కోట్లు అట‌?!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా ధరకేకుతోందని కథ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీపై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ రాలేదు. కానీ, ఇప్ప‌టికే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని.. ఫ‌స్ట్ షెడ్యూల్ ను సైతం కంప్లీట్ చేశార‌న్న‌ది ఇన్సైడ్ టాక్‌. ఇక‌పోతే ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. మారుతి త‌న కెరీర్ లో ఇంత వ‌ర‌కు చేయ‌ని ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం ప్ర‌భాస్ తో చేయ‌బోతున్నాడ‌ట‌.

పాత థియేట‌ర్ లో దాచిన నిధిని వెతికి తీసే నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ప్రభాస్ సినిమా కోసం మారుతి ఒక అరుదైన ఎపిక్ థియేట‌ర్ సెట్టింగ్ ను వేయించాడట. హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి పాత థియేటర్ సెట్టింగ్ ను నిర్మించారట. ఇక ఈ థియేటర్ పేరు రాజా డీలక్స్ అని.. ఈ థియేట‌ర్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఒక పాత థియేట‌ర్ కు అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.