చిక్కుల్లో నాగార్జున‌.. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నాడుగా!?

అక్కినేని నాగార్జున కొత్త చిక్కుల్లో పడ్డారు. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున ప్రస్తుతం ఓవైపు హీరోగా వ‌రుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ పై అనేక చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే బిజినెస్ రంగాలోనూ పెట్టుబడులు పెడుతూ సత్తా చాటుతున్నారు.

అయితే నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశ్వెవాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని మండ్రెమ్ పంచాయతీ తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. నార్త్ గోవాలోని పాపుల‌ర్ విలేజ్ అయిన మాండ్రమ్‌లో నాగార్జున ఓ రెసిడెన్షియల్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు చేపట్టారు.

అయితే ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండానే ఆ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు సంబంధించిన కట్టడాలను ప్రారంభించాడు. ఈ నేప‌థ్యంలోనే గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జున‌కు నోటీసులు జారీ చేశారు. వెంటనే పనులు నిలిపివేయాలని, లేదంటే చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. దీంతో ఇప్పుడీ విష‌యంలో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఈ విష‌యంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.