నటి ప్రగతి హీరోయిన్గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా ఉంటున్నారని చెప్పవచ్చు.అలాంటి వారిలో నటి ప్రగతి కూడా ఒకరు .క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో చిత్రాలలో హీరోలకు తల్లిగా, అత్త పాత్రలలో చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ప్రగతి. ముఖ్యంగా ఈమె చేసేటువంటి వీడియోలు, డాన్సులు, జిమ్ వర్కౌట్లు వంటివి చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి.

Actress Pragathi: పెళ్లిలో రచ్చ చేసిన ప్రగతి.. డోలుపై కూర్చొని తీన్మార్‌  డ్యాన్స్ | Actress Pragathi exciting dance in her sister's wedding watch  video Telugu Cinema News | TV9 Teluguప్రగతి ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ f-2 సినిమాలో ఇమే కామెడీ సైతం బాగా అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ పాత్రకు ప్రగతి తప్ప మరెవరు సెట్ కారు అనే విధంగా నటించిందని చెప్పవచ్చు. ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించక ముందే హీరోయిన్గా నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నటి ప్రగతి అప్పట్లో ప్రముఖ సినీ దర్శకుడు భాగ్యరాజ హీరోగా నటించిన గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అనే చిత్రంలో హీరోయిన్గా నటించినది.

Gowramma Nee Mogudevaramma || Telugu Full Movie || K. Bhagya Raja,  Pragathi, Mohana || Full HD - YouTube

అలాగే ఈ చిత్రం మలయాళం లో తెలుగు భాషలలో విడుదల అయింది. కానీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రగతి కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది క్రమంలోని తమ వైవాహిక జీవితం పైన దృష్టి పెట్టి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది కానీ వివాహమైన కొన్ని సంవత్సరాలకి తన భర్త నుండి విడిపోయింది. ప్రగతి పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకొని వారిని చూసుకుంటోంది. ప్రస్తుతం ప్రగతి కి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతొంది.