ఈడీ నోటీసులు..నిన్న విజయ్ దేవరకొండ.. నేడు టైసన్ కూడా..!

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి లైగర్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి పైన కూడా ఈడి అధికారులు దూకుడు పెంచడం జరుగుతోంది. లైగర్ సినిమా విడుదలై ఇప్పటికి మూడు నెలలు కావస్తున్న ఈడి అధికారులు నిన్నటి రోజున హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించడం జరిగింది .అలాగే చిత్ర డైరెక్టర్ సహనిర్మాత అయిన పూరి జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడి అధికారులు సామాన్లు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా లైగర్ సినిమాలో నటించిన మైక్ టైసన్ పై కూడా ఈడీ అధికారులు తాజాగా ప్రశ్నించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

deverakonda: Mike Tyson punched me by mistake, says 'Liger' actor Vijay  Deverakonda - The Economic Timesకాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బక్క జడ్సన్ దాఖలు చేసిన ఫిర్యాదుల మేరకు ఫెడరల్ ఏజెన్సీ విదేశీ మరకద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన పై విచారణ చేపట్టడం జరిగింది. దీంతో లైగర్ సినిమాపై పెట్టుబడులు అక్రమ మార్గాల ద్వారా వచ్చాయని జడ్సన్ తన ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు లైగర్ సినిమాలో బ్లాక్ మనీని పెట్టుబడులుగా పెట్టారని ఆయన ఫిర్యాదులో తెలియజేశారు. పన్ను చెల్లింపు నుండి తప్పించుకోవడానికి ఇది సులభమైన మార్గమని కొందరు భావించి అనేక విదేశీ కంపెనీలు మార్గాల ద్వారా లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టారని జడ్సన్ తన ఫిర్యాదులో తెలియజేశారు.

Mike Tyson Birthday: 'Liger' team celebrated boxer Mike Tyson's birthday,  Vijay Deverakonda wished and wrote - Didn't even dream of meeting you... |  India Ragలైగర్ చిత్రాన్ని హిందీ, తమిళ్, తెలుగు కన్నడ మలయాళం వంటి ఐదు భాషలలో నిర్మాణమై విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.125 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే లాభాలు రాకపోయినా పెట్టుబడిని కూడా తిరిగి పొందడంలో లైగర్ చాలా ఘోరమైన విఫలమైంది. ఇక ఈ చిత్రంలో అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ తో పాటు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న సిబ్బందిపై ఈడి అధికారులు సామాన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక విరే కాకుండా కరణ్ జోహార్, పూరి, ఛార్మికౌర్ ,విజయ్ దేవరకొండ ఇలా అందరినీ ఈడి అధికారులు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది.