డింపుల్ హయతి.. ఈ తెలుగు అమ్మాయి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గల్ఫ్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ `గద్దలకొండ గణేష్` సినిమాలో `జర్ర జర్ర` అనే స్పెషల్ సాంగ్ చేసి తెలుగువారికి దగ్గర అయింది.
ఈ ఏడాది `ఖిలాడి` మూవీతో హిట్టు కొట్టి తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకోవాలని ఆశపడింది. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో డింపుల్ హయతిని ఎవరు పట్టించుకోవడం లేదు.
అయినా సరే ఈ అమ్మడు ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా తన అందాలతో గేలం వేస్తోంది. ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసిపోని విధంగా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా గ్రీన్ కలర్ క్రాప్ టాప్ ధరించి మత్తు కళ్ళతో గమ్మత్తు చేస్తూ కొంటెగా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రకారును ఆకర్షిస్తూ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ ను చూస్తే ఏముంది రా బాబు అనుకుండా ఉండలేరు. అంత అందంగా డింపుల్ కనిపిస్తోంది. మరి లేటెందుకు డింపుల్ తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.