లైన్‌లోకి వచ్చిన బాబు..వెస్ట్‌లో టీడీపీ సత్తా..!

ఈ మధ్య చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు బాగా వస్తుంది..మరి ఎవరైనా పార్టీ అధినేతలు వస్తే.. నేతలు జనాలని తరలించే పనిలో ఉంటారు. అటు జగన్‌కైనా, ఇటు బాబుకైనా..అయితే ఎంత జనాలని తరలించిన వారు ఎక్కువ గంటలు వెయిట్ చేయడం..స్పీచ్ అయ్యేవరకు ఉండటం కష్టమైన పని. ఈ మధ్య జగన్ సభల్లో జనం మధ్యలోనే వెళ్లిపోవడం చూస్తున్నారు. కానీ చంద్రబాబు రోడ్ షోల్లో పరిస్తితి భిన్నంగా ఉంది.

పర్యటన ఆలస్యంగా నడిచిన సరే..బాబు కోసం టీడీపీ శ్రేణులు గాని, జనం గాని ఎదురుచూస్తున్నారు. పూర్తిగా స్పీచ్ అయ్యేవరకు ఉంటున్నారు. ఈ మధ్య బాబు కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు ఎలాంటి జన స్పందన చూశామో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటించారు..ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మొదట దెందులూరు, ఆ తర్వాత చింతలపూడి నియోజకవర్గాల్లో పర్యటించారు. దెందులూరు ఎంటర్ అవ్వగానే తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో స్వాగతం పలికారు.

ఆ తర్వాత విజయరాయి గ్రామంలో రోడ్ షో నిర్వహించగా అక్కడ జనం భారీగానే వచ్చారు. ఇక రాత్రి చింతలపూడిలో బహిరంగ సభ నిర్వహించగా…అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, ప్రజలు వచ్చారు. రాత్రి ఆలస్యమైన ప్రజలు బాబు కోసం ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో బాబుకు మద్ధతు పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.

అదే సమయంలో బాబు స్పీచ్‌లు కూడా లైన్‌లోకి వచ్చాయి. అంతకముందు తన గురించి తాను ఎక్కువ డప్పు కొట్టుకున్నట్లు మాట్లాడేవారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి అంశం జనంలోకి వెళ్ళేలా మాట్లాడుతున్నారు. అలాగే ఎక్కడ పర్యటన చేస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు..అక్రమాలపై ఫైర్ అవుతున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం పథకాల పేరుతో 10 రూపాయిలు ఇచ్చి, 100 రూపాయిలు కొట్టేస్తుందని, తాను వస్తే పథకాలు రద్దు చేస్తానని వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని, తాను అధికారంలోకి వస్తే ఈ పథకాలు కొనసాగిస్తూనే…ఇంతకంటే గొప్ప పథకాలు అమలు చేస్తానని చెబుతున్నారు. మొత్తానికి ప్రజలకు చేరువయ్యేలా బాబు స్పీచ్‌లు ఉన్నాయి.

Share post:

Latest