ఎన్టీఆర్ ని కాదని రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు..!!

ఉప్పెన చిత్రంతోనే మొదటిసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ శిష్యుడే. తన మొదటి చిత్రంతోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా పేరు బాగా పాపులర్ అయింది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టును ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగి ఒక స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఇందులో ఓల్డ్ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ సినిమా లో ఎన్టీఆర్ నటించిన పెద్దగా ఆసక్తి చూపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan, Buchi Babu Sana team up for a sports drama

దీంతో బుచ్చిబాబు మరొక హీరోని వెతికె పనిలో పడ్డారు. ఫైనల్ గా రామ్ చరణ్ కు స్టోరీ చెప్పడంతో తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రీసెంట్గా ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. “కొన్నిసార్లు తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది” అంటే రామ్ చరణ్ చేయబోతున్న ఈ ప్రాజెక్టుని ప్రకటించారు బుచ్చిబాబు. ఇంటెన్సిటీతో ఉన్న ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్లు స్పోర్ట్స్ మెన్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగి స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

RRR సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ బుజ్జి బాబు ఈ ప్రాజెక్టును అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ సమయంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు చిత్ర బృందం. మరి ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందో లేదో అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బుచ్చిబాబు.

Share post:

Latest