నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడోచ్.. అదిరిపోయే ప్లాన్ తో బాలయ్య రెడ్డి..!

నందమూరి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వచ్చే సంవత్సరం రాబోతుందని బాలకృష్ణ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ పై సంవత్సరం ముందు నుంచే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా.. ? 2023లో మోక్షజ్ఞ పక్కాగా వస్తాడని చెప్పిన బాలయ్య.. ఇప్పుడు దాని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారా..? అయితే ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న గ్రౌండ్ వర్క్ చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. టాలీవుడ్ లో ఉన్న కుర దర్శకులకు తన తనయుడిని బాగా దగ్గర చేస్తున్నారా..? మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఎంచుకున్న ప్లాన్ ఏంటి..?

ఇండస్ట్రీలో ఉన్న కుర్ర దర్శకులకు తనయుడిని బాగా రిజిష్టర్ చేస్తున్నారా..? అసలు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య వేస్తున్న ప్లాన్ ఏంటి..?

ఇప్పటివరకు తన సినిమాల మీద ఫోకస్ పెట్టిన బాలకృష్ణ.. ఇప్పటినుంచి తన తనయుడు సినిమాల బాధ్యత కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పై రకరకాల చర్చలు వస్తున్నాయి. ఈ మధ్యనే ఈ వార్తల అన్నిటికి బాల‌య్య‌ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. 2023 లోనే తన దర్శకత్వంలో మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు బాలయ్య ప్రకటించాడు. ఇప్పుడు ఈ ఎంట్రీ కోసం తెరవనుక గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్య బాలకృష్ణ ఏ సినిమా ఫంక్షన్‌కు వెళ్లిన తన కొడుకు లేకుండా వెళ్లడం లేదు. గతంలో ఎప్పుడు బాలకృష్ణ తన కొడుకుని వెంట పెట్టుకుని బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాక తన వంట తీసుకొస్తూ దర్శకులతో పరిచయాలు పెరిగేలా చూస్తున్నాడు బాలయ్య.

అందులో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇప్పటికే మోక్షజ్ఞ తొలి సినిమా కోసం అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, పూరీతో పాటు బోయపాటి పేర్లు వినిపించాయి. ఇవేం కాదు.. ఆదిత్య 999తో కొడుకును లాంఛ్ చేస్తానని అప్పట్లో చెప్పారు బాలయ్య. మరి ఇందులో ఏది జరుగుతుందో చూడాలిక.

ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలను కొడుకుతో కలిసి వీక్షిస్తున్నాడు బాలయ్య. మొన్న బింబిసారా సినిమాను.. తాజాగా హిట్2 ను కూడా స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకొని తన కొడుకుతో కలిసి వీక్షించాడు బాలయ్య. ఆ ఈవెంట్లో మోక్షజ్ఞ అందరికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కోసం అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, పూరి తో పాటు బోయపాటి శ్రీను పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇవేం కాకుండా తన డైరెక్షన్లో రాబోయే ఆదిత్య 999 సినిమాతో తన కొడుకును తన డైరెక్షన్లోనే టాలీవుడ్‌కు పరిచయం చేయిస్తానని బాలకృష్ణ చెప్పారు. ఇప్పుడు ఇందులో ఏది నిజం అవుతుందో చూడాలి.

Share post:

Latest