తూచ్..మేము విడిపోవడం లేదు..మళ్లీ కలిసిపోయిన స్టార్ కపుల్..!?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ..బాలీవుడ్లో టాప్ ఫైవ్ హీరోలలో ఒకరుగా నిల్చుని సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాగా రీసెంట్గా ఈ మధ్యకాలంలో అమీర్ ఖాన్ చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి.

ఆయన లాస్ట్ గా నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా ఎంతటి డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుందో మనకు తెలిసిందే. కాగా అంతకుముందే అమీర్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కిరణ్ రావుని దూరం పెట్టిన సంగతి తెలిసిందే. చాలా అన్యోన్యంగా ఉన్న ఈ భార్యాభర్తలు కొన్ని కారణాల కారణంగా మేమిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు . అంతేకాదు పిల్లలతో గడపడానికి నటనకు విరామం ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు . అయితే ఆ తర్వాత అమీర్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు .

అంతేకాదు పిల్లలతో గడపడానికి ఇద్దరు సమయం కేటాయించేవారు. కాగా రీసెంట్గా బాలీవుడ్ జనాలను సంతోషపరిచాడు అమీర్ ఖాన్.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కిరణ్ తో కలిసి కొత్త ప్రొడక్షన్ కార్యాలయం పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు . ఈ పూజా కార్యక్రమాలల్లో హారతి ఇస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వేడుకకి ఆయన కుమారుడితో పాటు సన్నిహితులు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరవ్వడం సంతోషించాల్సిన విషయం . కాగా పూజా కార్యక్రమం కోసం కలిసిన ఈ జంట త్వరలోనే భార్యాభర్తలుగా కలిసిపోతే చూడాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు . చూడాలి మరి ఆరోజు ఎప్పుడు వస్తుందో అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు..?

Share post:

Latest