టాలీవుడ్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పడేసిన అక్కినేని హీరోలు.. ఎందుకంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి ప్రేక్షకాధారణ ఉంది. మొదట ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా తండ్రి లాగానే స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అల్లరిస్తున్నాడు. అలానే నాగచైతన్య, అఖిల్ కూడా హిట్, ఫ్లాప్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తున్నారు.

అయితే ఈ మధ్య మాత్రం అక్కినేని కుటుంబం పరాజయాలను రుచి చూడాల్సి వస్తుంది. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా ఇటీవలే రిలీజ్ అయి ప్లాప్ అయింది. అలానే నాగచైతన్య నటించి థాంక్యూ సినిమా కూడా పరాజయం పాలయింది. ఇక అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిజల్ట్స్ ఎలా వుంటాయో చూడాలి మరి.

ఇదిలా ఉండగా అక్కినేని ముగ్గురు హీరోలా గురించి సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే ‘అక్కినేని హీరోలు మన తెలుగు డైరెక్టర్స్‌ని దూరం పెట్టారట’. ది ఘోస్ట్ సినిమా తరువాత నాగార్జున తమిళ్ డైరెక్టర్‌తో ఓ సినిమాకి ఓకే చెప్పాడట. ది ఘోస్ట్ సినిమా డైరెక్ట్ మోహన్ రాజతో కలిసి ఇంకో సినిమాలో నటిస్తున్నారట నాగార్జున. ఇక నాగచైతన్య కూడా థాంక్యూ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడట. అలానే అఖిల్ కూడా తన నెక్స్ట్ సినిమా ఒక తమిళ్ డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మధ్య తమిళ్ డైరెక్టర్స్ మంచి హిట్స్ కొడుతున్నారు. దాంతో అక్కినేని హీరోలు తెలుగు దర్శకులను దూరం పెట్టి తమిళ దర్శకుల డైరెక్షన్‌లో నటించడానికి రెడీ అవుతున్నారు.

Share post:

Latest