అడివి శేష్ 8 బాలీవుడ్ సినిమాలు రిజెక్ట్ చేసాడట తెలుసా?

టాలీవుడ్ నటుడు అడివి శేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2 నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీనితో హిట్ 2 చిత్రం సినిమా యూనిట్ మంచి హ్యాపీగా వున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఈ చిత్రాన్ని ఒక ప్రాంచైజీలా తీయడం విశేషం. ఇక ఈ సినిమాతో హిట్ 3లో హీరో ఎవరో రివీల్ అయింది. మీకు ఈపాటికే ఆ న్యూస్ వచ్చే ఉంటుంది. ఇంకెవరు? నాని హీరోగా హిట్ 3లో జనాల్ని రంజింపజేయనున్నాడు.

హిట్ 2 క్లైమాక్స్ లో ఈ క్రేజీ అప్డేట్ రివీల్ చేయడం విశేషం. ఇక అడివి శేష్ సినిమా గ్రాఫ్ ఇపుడు చాలా బాగుంది. గూఢచారి, మేజర్ లాంటి చిత్రాలతో అడివి శేష్ హిందీలో కూడా పాపులర్ అయ్యాడు. దాంతో పాన్ ఇండియా క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా 26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన మేజర్ చిత్రంతో అడివి శేష్ అదరగొట్టేశాడు. దాంతో బాలీవుడ్ అడివి శేష్ కి అవకాశాలు వెల్లువెత్తాయట. ఈ విషయాన్ని అడివి శేష్ తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేయగా మనం చూసాం. మేజర్ మూవీ తర్వాత తాను 8 బాలీవుడ్ చిత్రాలని రిజెక్ట్ చేసాడంటే మీరు నమ్ముతారా?

ఆల్రెడీ ఇప్పటికే పలు చిత్రాలకి కమిటైన శేష్ బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేయక తప్పలేదు అని దానికి వివరణ ఇచ్చాడు. కాగా శేష్ ప్రస్తుతం 4 చిత్రాలకి వర్క్ చేస్తున్నాడు. ఆ నాలుగు చిత్రాలు హిందీలో కూడా రిలీజ్ అవుతాయనే నమ్మకం చెబుతున్నాడు. ఇక హిట్ 2 రిలీజ్ కావడంతో గూఢచారి 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతాం అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు శేష్. అడివి శేష్ మొదట టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, ఇప్పుడు హిట్ 2 ఇలా వరుస విజయాలతో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు.