బాక్సాఫీస్ వ‌ద్ద `హిట్ 2` బీభ‌త్సం.. 2డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మీనాక్షిచౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తే.. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై పాజిటివ్ టాక్‌ను అందుకుంది.

టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.6.43 కోట్ల షేర్‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. 2వ రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బీభ‌త్సం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ. 3.28 కోట్ల షేర్ ను అందుకుంది. ఇక ఏరియాల వారీగా హిట్ 2 రెండు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 3.66 కోట్లు
సీడెడ్: 74 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 95 ల‌క్ష‌లు
తూర్పు: 47 ల‌క్ష‌లు
పశ్చిమ: 31 ల‌క్ష‌లు
గుంటూరు: 49 ల‌క్ష‌లు
కృష్ణ: 42 ల‌క్ష‌లు
నెల్లూరు: 27 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 7.31 కోట్లు(11.90 కోట్లు~ గ్రాస్‌)
———————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.85 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 2.80 కోట్లు
————————————
వైర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 10.96 కోట్లు(19.15 కోట్లు~ గ్రాస్‌)
————————————

కాగా, ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. ఈ మార్క్ ని అందుకోవాలి అంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ.4.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే స‌రిపోతుంది.

 

Share post:

Latest