పెళ్లైన ఆరు నెల‌ల‌కే శుభ‌వార్త చెప్పిన పూర్ణ‌.. వెల్లువెత్తుతున్న విషెస్‌!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితమైన మలయాళ నటి పూర్ణ ఇటీవ‌ల పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్‌, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకుంది. జూన్ 12వ తేదీ దుబాయ్ లో ఈ జంట‌ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

పూర్ణ పెళ్లి ఫోటోలు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే పెళ్లైన ఆరు నెల‌ల‌కే పూర్ణ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. అవును, మీరు ఊహించిన‌దే. పూర్ణ త‌ల్లి కాబోతోంది. త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని పూర్ణ స్వ‌యంగా వెల్ల‌డించింది. ఈ శుభ త‌రుణాన్ని పూర్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది.

కేక్‌ కట్‌ చేసి సంతోషంగా గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో పూర్ణ దంప‌తుల‌కు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాగా, పూర్ణ ప్ర‌స్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీల్లో కూడా కొన్ని షోస్‌లో జడ్జిగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు గ‌ర్భం దాల్చ‌డంతో.. ఆమె కొన్నాళ్లు తెర‌పై క‌నిపించ‌డం క‌ష్ట‌మే అని చెప్పాలి.