అయ్యన్నని గెలిపించనున్న వైసీపీ..!

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేస్తూ..పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఉత్తరాంధ్రకు తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక పిల్లర్ లాంటి నేత. అలా స్ట్రాంగ్ గా ఉండే అయ్యన్న..గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నర్సీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు. ఇలా ఓటమి పాలైన అయ్యన్నని మళ్ళీ పుంజుకోకుండా వైసీపీ చేయొచ్చు..నర్సీపట్నంలో బోలెడు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటూ, ప్రజా సమస్యలని పరిష్కరిస్తూ ఉంటే..నర్సీపట్నంలో అయ్యన్నకు గెలిచే ఛాన్స్ రాదు.

కానీ అలాంటి కార్యక్రమాలు వైసీపీ చేయడం లేదు..నర్సీపట్నంలో అభివృద్ధి దేవుడెరుగు గాని..ముందు ప్రజా సమస్యలు తీరితే అదే చాలు. కానీ అది కూడా జరగడం లేదు..కేవలం పథకాల పంపిణీ నడుస్తోంది. ప్రజలని ఆకర్షించే పనులు కాకుండా..అయ్యన్నని వ్యక్తిగతం టార్గెట్  చేసి, ఆయనని రాజకీయంగా దెబ్బకొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇలా వ్యక్తిగతంగా రాజకీయం వస్తుందో..అప్పుడు ఆటోమేటిక్‌గా బాధిత నాయకులకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు అయ్యన్న విషయంలో అదే జరిగింది. తాజాగా ఆయన..ఓ 2 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని, అలాగే నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పి సి‌ఐ‌డి పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు.

అసలు అయ్యన్న ఎన్‌వోసీని ఉపయోగించి ఎవరినీ మోసం చేయలేదని, ఎక్కడా లబ్ధిపొందలేదని, ఎవరి నుంచీ రుణాలు తీసుకోలేదని  అయ్యన్న తరుపు న్యాయమూర్తి స్పష్టంచేశారు. 41ఏ నోటీసివ్వాలని ఆదేశించారు. దీంతో గత్యంతరం లేక ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి సీఐడీ విడుదల చేసింది. అంటే ఓ కక్షపూరితమైన వైఖరితోనే అరెస్ట్ జరిగిందని ప్రజల్లోకి వెళ్లిపోయింది. పైగా రెండు సెంట్ల భూమి అంటున్నారు.. అది అక్రమణకు సంబంధించి ఆధారాలు పూర్తి స్థాయిలో లేవు.

కానీ విశాఖలో ఎన్ని వందల ఎకరాలని ఆక్రమిస్తున్నారో, కబ్జా చేస్తున్నారో, ఋషికొండ పరిస్తితి ఏంటో, దసపల్లా భూముల సంగతి ఏంటో..అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలా అయ్యన్నని అరెస్ట్ చేయడంపై…ఆయనకే సానుభూతి వచ్చింది..ఇలా టీడీపీ నేతలని చాలామందిని అరెస్ట్ చేసి..వారికి సానుభూతి పెరిగేలా చేశారు. నర్సీపట్నంలో ఘోరంగా ఓడిన అయ్యన్నని వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు దిశగా తీసుకెళుతుందని చెప్పొచ్చు.