మిస్ అర్జెంటీనా మరియానా వారెలా, మిస్ ప్యూర్టో రికో ఫాబియో వాలెంటైన్.. మొదటి సారి అందాల పోటీలో కలుసుకున్న వీరిద్దరూ అనుకోకుండా ప్రేమలో పడ్డారు. ఇంతకీ వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కాదు భిన్నంగా అందగత్తెళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. అంతేకాదు రహస్యంగా పెళ్ళి కూడా చేసుకున్నారు.
ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ కహానీ యావత్ ప్రపంచమంతటా చెప్పుకుంటున్నారు . అయితే థాయిలాండ్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 పోటీలో మిస్ అర్జెంటీనా- మిస్ ప్యూర్టో రికో పాల్గొన్నారు. వీరిద్దరూ మెదటి పది స్థానాల్లో నిలిచిన వారిలో.. మిస్ అర్జెంటీనాగా మరియానా వరెలా, మిస్ ప్యూర్టో రికోగా ఫాబియోలా వాలెంటైన్ విజేతలుగా సెలెక్ట్ అయ్యారు.
ఇక ఈ పోటీల్లోనే వీరి ప్రేమ చిగురించింది. రెండు వేరు వేరు దేశాలకు చెందిన ఈ ముద్దు గుమ్మలు గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడూ బయటపెట్టలేదు. అభిమానులంతా వీరిద్దరూ మంచి స్నేహితులని ఇంతకాలం అపోహలో ఉన్నారు. ఐతే మరియానా వరెలా, ఫాబియోలా వాలెంటైన్ తమ రహస్య పెళ్ళి గురించి సోహల్ మీడియా వేదికగా బయటపెట్టడంతో సర్వత్రా ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే వీరిద్దరూ అక్టోబర్ 28న తమకు ఎంతో ప్రత్యేకమైన రోజని అలాగే తమ రిలేషన్షిప్ ను వెల్లడిస్తున్నట్లు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో వారికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల సమయంలోనే 1 లక్షకు పైగా లైకులు, 2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చి ఫుల్ పాపులర్ అయింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మరియు నెటిజనులు వారికి అభినందనలు తెలుపుతున్నారు. మరి కొంతమంది ఇదెక్కడి చోద్యం రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.