రామచంద్రాపురంలో బిగ్ ట్విస్ట్..వైసీపీకి షాక్?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోరు వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. అలా అని టీడీపీకి ప్లస్ అవుతుందనుకుంటే కష్టమే. వైసీపీలో మైనస్‌ని యూజ్ చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది. దీంతో రెండు పార్టీలకు నెగిటివ్ కనిపిస్తోంది. అలా రెండు పార్టీలకు పాజిటివ్ లేని నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం కూడా ఒకటి.

ఈ నియోజకవర్గంలో వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు. ఆయన బలం బాగానే ఉంది. మరి అంతా బాగానే ఉంది..పైగా మంత్రిగా ఉన్నారు..ఇంకా ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చాక ఆయనకు మండపేట ఇంచార్జ్ బాధ్యతలు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

అయినా సరే ఈయన సొంత స్థానమైన రామచంద్రాపురంని వదలలేదు. ఇక్కడ ఆయనకు సెపరేట్ గ్రూపు ఉంది. ఈ గ్రూపుకు..మంత్రి చెల్లుబోయిన అంటే పడదు. అటు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఈ నియోజకవర్గానికి చెందిన నేత. ఈయనకు కూడా సెపరేట్ గ్రూపు ఉంది. ఇలా మూడు వర్గాల మధ్య రచ్చ అంతర్గత పోరు నడుస్తోంది.

ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు..ఆయన ఏదో మొక్కుబడిగా పనిచేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఎవరికి సీటు దక్కిన వైసీపీకి చెక్ పడుతుంది. పైగా ఇక్కడ ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే..వైసీపీలో ఉన్న ముగ్గురు నేతల్లో ఒకరు…టీడీపీ లేదా జనసేనలోకి వచ్చి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అంటే పొత్తులో భాగంగా రామచంద్రాపురం సీటు టీడీపీ-జనసేనల్లో ఏ పార్టీకి దక్కితే…ఆ పార్టీలోకి ఒక నేత వచ్చి పోటీ చేస్తారని అంటున్నారు. మొత్తానికి రామచంద్రాపురంలో వైసీపీకి షాక్ తగిలేలా ఉంది.

Share post:

Latest