వావ్: క్రేజీ ఆఫర్ కొట్టేసిన విజయ్ దేవరకొండ..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్.. ఈ సినిమా విడుద‌లై విజయ్ కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాను తెలుగు స్టార్ట్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా డిజాస్టర్ పాలయ్యింది. ఇంతటి భారీ సినిమా డిజాస్టర్ అవడంతో దీని ప్రభావం విజయ్ కెరియర్ మీద పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ దీనికి విరుద్ధంగా విజయ్ దేవరకొండ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Vijay Deverakonda Shoots With A Rifle Along With A Jawan

విజయ్ టాలీవుడ్ లో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో విజయ్ కి జంటగా సమంత నటిస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా తర్వాత కూడా టాలీవుడ్ లో అగ్ర దర్శకుల సినిమాలతో బిజీ అవ్వనున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ బాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.

DILWALE DULHANIA LE JAYENGE full MOVIE 1080𝐏| Dilwale Dulhaniya le  jayenge|DDLJ MOVIE|review & Facts - YouTube

ఇక ఈ సినిమా షారుక్ ఖాన్ కెరియర్ లోనే అత్యంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో బాలీవుడ్లో అదిరిపోయే క్రేజ్ ను దక్కించుకున్నాడుు షారుక్. అయితే ఇప్పుడు ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య చోప్రా ప్రస్తుత కాలానికి అనుగుణంగా రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. రీమిక్ లో ముందుగా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆదిత్య చోప్రా ఈ సినిమాలో విజయ్ దేవరకొండను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా జాన్వి కపూర్ నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest