వామ్మో.. ఆ ట్రెండి టాక్ జంటపై సినిమా తీస్తారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో వీకే నరేష్,పవిత్ర లోకేష్ ఎక్కడా లేని క్రేజ్ ను సంపాదించారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య సంబంధం గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.వీరిద్దరూ గడిచిన కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆమధ్య కన్నడ మీడియాలో కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగళూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి పలు కీలకమైన విషయాలను కూడా తెలియజేసింది. ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

Naresh, Pavitra Lokesh become brother-sister type characters - Telugu News  - IndiaGlitz.comఇటీవల కాలంలో అనేక చిత్రాలలో కలిసి నటించిన నరేష్ పవిత్రలోకి ఇప్పటివరకు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఇద్దరు తరచూ కలుస్తూ ఉండడం ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతూ ఉండడం.. నరేష్ మూడవ భార్య తెరలేపిన వివాదం తర్వాత పరిస్థితులు వంటివి వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. అయితే ఈ విషయం తర్వాత వీరిద్దరూ సినిమాలలో కలిసి నటిస్తూ ఉన్న సన్నివేశాలకు ప్రేక్షకులలో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు జనాలు థియేటర్లలో ఈలలు వేస్తూ చాలా గోలగోలగా చేస్తున్నారు.

ఇక రీసెంట్గా ఆలీ రూపొందించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. అయితే ఇప్పుడు నరేష్, పవిత్ర తమ వ్యక్తిగత జీవితాల ఆధారంగా ఒక సినిమాను తీసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి పర్సనల్ లైఫ్ లో ఇప్పటివరకు జరిగిన పరిస్థితుల పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో నటీనటులు సైతం వీరిద్దరే ఉంటారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest