విక్టరీ వెంకటేష్ కి విక్టరీ దూరం అవుతోందా?

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలియని తెలుగు ప్రజానీకం ఉండరంటే అతిశయోక్తి కాదు. 90sలో దుమ్ముదులిపిన హీరోలలో వెంకటేష్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్… వీరంతా ఒక జనరేషన్ వారు. ఇందులో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున దూసుకుపోగా వెంకటేష్ ఎందుకనో ఈమధ్య నెమ్మదించారు. ముఖ్యంగా కోవిడ్ తరువాత అతనినుండి చెప్పుకోదగ్గ మంచి సినిమాలేవీ రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసిన చిరు.. సంక్రాంతికి మరో చిత్రాన్ని రెడీ చేస్తున్నారు.

గతేడాది అఖండతో సక్సెస్ చూసిన బాలయ్య తదుపరి మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ ఏడాది 2 సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నాగార్జున.. తనయుడితో కలిసి తన వందో చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయంలో వెంకటేష్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంతో వున్నారు. వెంకటేష్ కెరీర్ ప్రారంభం నుంచీ స్టార్ డమ్ – ఇమేజ్ అనే లెక్కలను పక్కన పెట్టి.. కథాబలమున్న సినిమాలకు ప్రాధాన్యత చేసేవారు.

కోవిడ్ సమయంలో ‘నారప్ప’ ‘దృశ్యం 2’ వంటి OTT రీమేక్ చిత్రాలతో అలరించారు. ఈ ఏడాది వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేసినప్పటికీ పెద్దగా ఆడలేదు. అలాగే నారప్ప, దృశ్యం సినిమాలు కూడా పెద్దగా ఆడింది లేదు. దాంతో సురేష్ ప్రొడక్షన్స్ కాస్త డీలా పడింది. మరోవైపు రానా కూడా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. వరుసల ప్లాపులతో రానా యాంగ్ స్టార్స్ తో కాస్త వెనకబడ్డాడు. దాంతో రామానాయుడు స్టూడియోలో నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా రానా మరియు వెంకటేష్ లు త్వరలో మంచి కం బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశపడుతున్నారు.

Share post:

Latest