ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంటే తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితమే. సినీ సెలబ్రెటీల జాతకాలు చూస్తు.. రాజకీయ నాయకుల జాతకాలను చూస్తూ పలు పూజలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత వివాహం కుదిరిన సమయంలో ఈయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి జాతకం ప్రకారం వివాహమైన నాలుగేళ్లకు వీడిపోతారంటు తెలియజేశారు. అయితే ఆయన చెప్పినట్టుగానే వారిద్దరు విడిపోవడం జరిగింది. దీంతో అప్పటి నుంచే వేణు స్వామి మాటలపైన ప్రతి ఒక్కరికి నమ్మకం కుదురుతోంది. అయితే కొంతమంది మాత్రం ఈ విషయాలను నమ్మలేదు.
ఇక తర్వాత హీరోయిన్ రష్మిక స్టార్ హీరోయిన్ చేసేందుకు అప్పట్లో ఆమె ఇంట్లో పలు పూజలు కూడా చేశారు. ఆ పూజ ఫలితంగానే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయిందని చాలామందిని నమ్మించారు. దీంతో స్టార్ హీరోయిన్ కావాలని ఎంతోమంది కూడా వేణు స్వామి ని సంప్రదించడం జరిగింది. రీసెంట్గా కృతి శెట్టి కూడా ఈయన కలిసినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి ఏదో పూజలు చేసినట్లుగా కూడా వేణు స్వామి తెలియజేశారు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు వేణు స్వామి మరొకసారి పలు హాట్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరో, హీరోయిన్గా ఉన్న ఇద్దరు మరణిస్తారంటూ బాంబు పేల్చారు. వారిద్దరు ఒకే సమయంలో చనిపోతారంటూ చెప్పడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీ అంశంగా మారుతోంది ఈ విషయం. ఈయన చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు కూడా ఆగ్రహాన్ని తెలియజేశారు. నువ్వు చెప్పే ప్రతి విషయం జరుగుతుందని ఎలా చెప్తావ్.. నాగచైతన్య, సమంతలది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి విడిపోయారు. అది వేరే విషయం.. కానీ ఇప్పుడు ఎవరు చనిపోతారో కూడా నువ్వే చెప్పేస్తావా.. అంటూ దారుణంగా కోపడ్డారు. ఆ హీరో ,హీరోయిన్ ఎవరనే విషయం అభిమానులలో చాలా భయాందోళనలకు గురిచేస్తోంది.