విడాకుల వ్యవహారం పై స్పందించిన.. ఊహ-శ్రీకాంత్..!!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోలలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. దాదాపుగా ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ఎంతో మంది హీరోలతో కలిసి కూడా నటించారు శ్రీకాంత్. ఇప్పుడు తాజాగా విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరో శ్రీకాంత్ తన సహనటి అయిన ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక కుమార్తె కూడా ఉన్నది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఊహ, శ్రీకాంత్ విడిపోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వాటిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Srikanth and Ooha (Sivaranjini) family at Nirmala Convent Audio Launch –  Eenaduvasundharaఒక ప్రముఖ ఛానల్ కి తెలియజేస్తూ.. శ్రీకాంత్, ఊహ మాట్లాడుతూ.. మేమిద్దరం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాము..మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఈ వార్తలలో అసలు నిజం లేదని.. కేవలం అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆ వార్తలను కొట్టి పారేశారు. దీంతో వీరి విడాకుల వ్యవహారం ఒక ఫేక్ వార్తలు అంటూ పుల్ స్టాప్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో అటు శ్రీకాంత్ అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Srikanth ooha : మాజీ నటి ఊహకు శ్రీకాంత్ విడాకులు ఇవ్వనున్నాడా ఇండస్ట్రీలో  వైరల్ న్యూస్

శ్రీకాంత్ , ఊహకు జన్మించిన పిల్లలు రోషన్, మేధ, రోహన్ ఇందులో రోషన్ పెద్దకొడుకు కాగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదట నిర్మల కాన్వెంట్ సినిమా ద్వారా ఏంట్రీ ఇచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో బాగానే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రోషన్ కూడా తన సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇక శ్రీకాంత్, ఊహ విడాకుల వ్యవహారంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Share post:

Latest