అయ్య బాబోయ్..2 గంటలకు అర కోటి.. ఈ కన్నడ పిల్ల చాలా కాస్ట్లీ గురూ..!!

ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన టైం ఎలా నడుస్తుందో మనందరికీ తెలిసిందే . ఛలో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసుకుంది. ఇక తర్వాత వరుసగా బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు అందుకుంటూ బడా బడా ప్రాజెక్ట్స్ లో భాగమైంది. ఆశ్చర్యంగా అన్ని సినిమాలు హ్యూజ్ సక్సెస్ అవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే రష్మిక మందన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది .

మరీ ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన పుష్ప రిలీజ్ అయిన తర్వాత రష్మిక మందన పేరు మరింత ఎక్కువుగా వినిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన జీవించేసింది . ఫస్ట్ టైం డి గ్లామరస్ లుక్ లో కనిపించిన రష్మిక నా సామి సామి అంటూ నడుమును తిప్పేసి కుర్రాలను టెంప్ట్ చేసింది. కాగా ఈ సినిమా ఎఫెక్ట్ బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా ప్రాజెక్టులో భాగమైంది . అంతేకాదు టాలీవుడ్ లో రెండు.. కోలీవుడ్ లో రెండు ప్రాజెక్టులలో ఇన్వాల్వ్ అయ్యి.. తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

కాగా రీసెంట్గా కన్నడ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించడానికి రష్మిక మందన డిమాండ్ చేసిన అమౌంట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన సొంత గడ్డపై సినిమాలో నటించడానికి రష్మిక మందన్నా ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట . పాత్ర కూడా చాలా తక్కువ . జస్ట్ గెస్ట్ అపీరియన్స్ . రెండు మూడు నిమిషాలకు మించితే ఉండదు . అయితే ఇలాంటి రోల్ కోసం ఆమె అరకోటి డిమాండ్ చేయడం షాకింగ్ గా ఉంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. అది కూడా ఆమె సొంత గడ్డ కావడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే పుష్ప సినిమా తర్వాత ఈ పిల్ల టూ కాస్ట్లీ గా మారిపోయింది అంటూ మండిపడుతున్నారు మేకర్స్.

Share post:

Latest