వేసవిలో విడుదలయ్యే సినిమాల తేదీల లిస్ట్ ఇదే..!!

ఏ సినిమా ఇండస్ట్రి అయినా సినిమాల విడుదల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుడంతో సినిమాల విడుదల విషయంలో ఎంతో పోటీ నెలకొంది. కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్ కు ఎంతో ముందుగానే విడుదల తేదీలు బుక్ అయిపోతున్నాయి.. ఐదు ఆరు నెలల ముందే విడుదల తేదీలు ప్రకటించేస్తున్నారు.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత ఏవైనా సద్దుబాటులు ఉంటే అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సమ్మర్ సినిమాల విషయంలో కూడా అంతే .. 6 నెలల సమయం ఉండగానే వేసవిలో విడుదల అయే సినిమాల డేట్లు ఖరారు అయిపోవడం విశేషం.

Bhola Shankar | Actor Chiranjeevi's new poster of 'Bhola Shankar' released,  the film will knock in theaters on this day. - News8Plus-Realtime Updates  On Breaking News & Headlines

ఎంతో ముందుగా వేసవి రేస్ లోకి వచ్చిన సలార్, మహేష్- త్రివిక్రమ్ సినిమాలు ముందుగా అనుకున్న టైంలో రిలీజ్ కావటం లేదు. సలార్ ఆల్రెడీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని చిత్ర యునిట్‌ ప్రకటించింది. మహేష్- త్రివిక్రమ్ సినిమా కొన్ని అనుకోని కారణాలవల్ల ఇంకా ప్రారంభం దశలోనే ఉంది. ఈ సినిమా కూడా సమ్మర్ లో విడుదల చేయటం కష్టమే.. ఈ సినిమాలను పక్కన పెడితే మార్చి మూడో వారంలో డీజే టిల్లు2 సినిమాతో వేసవి సినిమాల హడావుడి మొదలవుతుంది. అదే నెల చివర్లో నాని దసరా సినిమా కూడా విడుదల కానుంది.

తర్వాత ఏప్రిల్ 7న రవితేజ నటించిన రావణాసుర సినిమా విడుద‌ల‌ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వారానికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్ సినిమాను ఫిక్స్ చేశారు. చిరంజీవి సినిమా విడుదలయ్యే రోజునే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 14న తమిళ్ సంవత్సరాది కాబట్టి ఆరోజున భారీ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అదే రోజున జైలర్‌ సినిమా విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నిస్తుందట. ఈ క్రమంలోనే నాగచైతన్య హీరోగా విక్రమ్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న సినిమాను కూడా ఏప్రిల్ 22న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.

టాలీవుడ్ లో సమ్మర్ లో రిలీజ్ అయ్యే అత్యంత భారీ సినిమాలలో ప్రధానంగా చూసుకుంటే హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏప్రిల్ లో రాకపోయినా ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేస్తారని తెలుస్తుంది. సమంత -విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ఖుషి సినిమాను కూడా షూటింగ్ పూర్తి అయితే సమ్మర్ లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్- బోయపాటి సినిమాని కూడా ఈ సమ్మర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇక ఈ సమ్మర్ కి కచ్చితంగా విడుదల చేసే సినిమాల లిస్ట్ ఇదే.

Share post:

Latest