నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ 2 టాక్ షో సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా బిజీగా ఉంటూనే హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి నాలుగవ ఎపిసోడ్ నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రోమో కి గెస్ట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు అయ్యారు. ఇక ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు చాలా ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన సీఎం అవుతారని ఎవరు ఊహించలేదు.. కానీ అనుహంగా ఆయన పేరు తెరమీదకి రావడంతో రాజకీయ వర్గాలను సంచలనంగా మారింది. దీంతో ఈ ప్రోమోలో క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గా ఆహ్వానించింది. అహ సంస్ధ. చివరిలో రాధిక గెస్ట్ గా రావడం జరిగింది.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసలు తాను బతికుండ బట్టే సీఎం అయ్యానని సంచలన విషయాన్ని తెలిపారు..అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. ఒక సీనియర్ మంత్రి వైయస్సార్ ను తప్పుదావా పట్టిస్తున్నాడని విషయాన్ని తెలియజేశారు.దీంతో ఇప్పుడు చాలా విషయం చర్చనీ అంశంగా మారుతోంది. సాధారణంగా వైయస్సార్ కు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సన్నిహిత్యం ఉండేది. కిరణ్ ను వైయస్సార్ చాలా నమ్మకంగా చూసేవారు.అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో వైయస్సార్ ను తప్పు దావ పట్టించిన మంత్రి ఎవరా అంటూ ఇప్పుడంతా ఆరాధిస్తున్నారు. పూర్తి క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రిమింగ్ కావాల్సిందే.