టాలీవుడ్ హీరోయిన్స్ అంతలా రెచ్చిపోవడానికి కారణం.. అదేనా..!!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయితే చాలు వారికి సెలబ్రిటీ హోదా అందుకోవడం పక్క అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఈ మధ్య సోషల్ మీడియా నుంచి ఎంతోమంది హీరోయిన్స్ గా మారిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ సైతం తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి చాలా అలవాటు పడిపోయారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడానికి ఇదొక సరైన ప్లాట్ఫారం గా భావించి అన్నిటిని అందులో పంచుకుంటూ ఉన్నారు.

ముఖ్యంగా హీరోయిన్లు సైతం నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు హాట్ ఫోటో షూట్లను వీడియోలను షేర్ చేస్తూ నేటి జనులను బాగా ఆకర్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఇలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు యాంకర్స్ కూడా ఇదే బాటలో పయనిస్తూ ఉన్నారు.

కొంతమంది సినిమాలు చేస్తున్న అవకాశాలు రాకపోయినా అందాల ఆరబోత చేస్తూ బాగా పాపులారిటీ సంపాదిస్తూ కొంతమంది హీరోయిన్గా అవకాశాలను సంపాదిస్తూ ఉన్నారు. ఇక ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునేందుకు కోసం దర్శక , నిర్మాతల దృష్టిలో పడేందుకు ఇలా తమ అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక గతంలో హోమ్లీ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న వారు కూడా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ డోర్స్ పెంచేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కేవలం వీరు అవకాశాల కోసమే ఇలా గ్లామర్ షో చేస్తున్నట్లుగా సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

Share post:

Latest