యాంకర్ రష్మీకి గిఫ్ట్ ఇచ్చిన హీరో… యవ్వారం ఏటంటే?

యాంకర్ రష్మీ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లీవుడ్. ఇక్కడ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలలో జనాలకు కామెడీని పంచుతూ అత్యధిక రేటింగ్ కలిగిన షో పేరు జబర్దస్త్. ఎప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఈ షో దూసుకుపోతోంది. ఇక ఈ షోలో నటించిన, నటిస్తోన్న కమెడియన్స్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఈ షోలో చేసినవారు అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే యాంకర్ రష్మీ కూడా సినిమాలలో చేస్తున్న సంగతి తెలిసినదే.

అయితే యాంకర్ రష్మీ జబర్దస్త్ షోలోకి రాకముందునుండే సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
దర్శకుడు దేవా కట్ట – శర్వానంద్ కాంబోలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాలో రష్మీ ఓ సూపర్ రోల్ చేసిన సంగతి తెలిసినదే కదా. కాగా ఈ సినిమా హిట్ అయింది. ఆతరువాత కూడా అమ్మడు కొన్ని సినిమాలు నటించింది. కానీ అనుకున్నంత పేరు రాలేదు. అయితే ఈ క్రమంలోనే జబర్దస్త్ షోలో యాంకరింగ్ అవకాశాన్ని వినియోగించుకొని సినిమాలలో లీడ్ రోల్స్ సంపాదిస్తూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చింది. ఇక తెలుగు నట రష్మీకి ఫాన్స్ కూడా వున్నారు.

అసలు విషయానికొస్తే, ఈమధ్య కాలంలో జబరదస్త్ షోకి రష్మీ దూరం అవుతూ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్ మీద చూపిస్తే అందుకు సెలబ్రిటీలు సమాధానం చెప్పారు. ఇక్కడే యాంకర్ రష్మీకి సంబంధించిన ఒక ప్రశ్న స్క్రీన్ మీద చూపించగా.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేమంటే ‘రష్మీకి ఒక హీరో విల్లాని గిఫ్ట్ గా ఇచ్చాడట?’ అనే ప్రశ్న రాగానే అక్కడ జడ్జిగా ఉన్న ఇంద్రజ ఆ హీరో ఎవరు? అంటూ రష్మీని అడిగేస్తుంది. అక్కడితో ప్రోమో అయిపోతుంది. ఇక రష్మీ ఏం చెప్పిందో తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు మనం ఆగాల్సిందే.

Share post:

Latest