గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో వచ్చేది ఆ రోజే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. చిరంజీవి తెరకెక్కించే సినిమాలు కూడా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అందులో విఫలం కావడంతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు.కానీ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. దీంతో తను నటించే తదుపరి సినిమాల పైన మరింత ఫోకస్ పెట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Godfather (2022) - IMDb

దసరా పండుగ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి సినిమా టాక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లు నష్టాన్ని చవిచూసినట్లుగా సమాచారం. ఇక దీంతో చిరంజీవి అభిమానుల సైతం చిరంజీవి కథల ఎంపిక విషయంలో రీమిక్స్ సినిమాలను ఎంపిక చేసుకోకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటి వేదికగా ఈ సినిమాను చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నారు.

Chiranjeevi's God Father seals its OTT release date | 123telugu.com
అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఈనెల 19వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటి లో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ టీజర్ విడుదల కాగా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలైనా చిరంజీవి రికార్డులు తిరగరాస్తాయేమో చూడాలి.

Share post:

Latest