బన్ని తో నటించిన సినిమాకి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటున్న నటి..!!

కొన్నిసార్లు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు నటి నటుల మధ్య పలు వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో నటీమణులను సైతం నిర్మాతలు ఇబ్బంది పెడుతూ ఉంటారని వార్తలు ఉంటాయి. అయితే కొంతమంది నిర్మాతలు సమయానికి డబ్బులు ఇచ్చినప్పటికీ మరి కొంతమంది మాత్రం సినిమా పూర్తయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. అలా ఎంతోమంది నటీనటులు మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి విషయంలో ఒక నటి రావడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Lirisha: వకీల్‌సాబ్‌లో సూపర్ ఉమన్ ...

ఆ నటి ఎవరో కాదు నటి లిరీష. ఈమె చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోని ఒక పోలీస్ పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక వెండితెర పైన కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది. ఎక్కువగా నెగిటివ్ పాత్రలోనే నటిస్తూ బుల్లితెర పైన మాత్రమే కాకుండా వెండితెరపై కూడా నెగటివ్ పాత్రలు నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా లిరీష. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ నటి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది.

లిరీష మాట్లాడుతూ తను లావుగా ఉండటం వల్ల ఎక్కువగా బాడీ సేమింగ్స్ చేశారని తెలియజేసినది. తనకు చాలా నెగిటివ్ పాత్రలలో నటించడమే ఇష్టమని తెలిపింది. తమిళ భాషతో పాటు ఇతర భాషలలో కూడా నటించడం చాలా ఇష్టమని కానీ అవకాశాలు రాలేదని తెలియజేసింది. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ దగ్గర తను ఒక సినిమాలో నటించినప్పుడు ప్రొడ్యూసర్ తనకు డబ్బులు ఇవ్వలేదని కేవలం అడ్వాన్స్ ఇచ్చి.. మిగిలినది ఇవ్వలేనని తెలియజేశాడట. అయితే డబ్బులు అడిగే సమయంలో ఆ ప్రొడ్యూసర్ పైనా ఎన్నోసార్లు అరిచిన ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ చివరికి డబ్బులు రావు అని వదిలేసానని తెలిపింది. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో 40 రోజులు నటించానని.. ఆ సమయంలో కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిపింది.

Share post:

Latest