ఆ టాప్ హీరో తొలి జీవితమంతా పూలబాటే.. కానీ చివరికి ఎలాంటి స్థితికి చేరుకున్నాడంటే!

ఒకప్పుడు ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద సినిమాల్లో నటించి అగ్ర హీరోగా కొనసాగాడు కాంతారావు. ఈ హీరో సంపన్న కుటుంబాన్ని నుంచి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అతని కుమారులు తమని ఆదుకోమని వేడుకునే స్థితికి రావడం ఎప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. బహిరంగంగా వారు వేడుకున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి కాంతారావు రోజుకి మూడు షిప్టులో పనిచేసినా కూడా ఆయన చివరి రోజులో ఎన్నో ఇబ్బందులు పాడారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే డబ్బు. కేవలం డబ్బు ఉంటేనే జనాలు పక్కన ఉంటారు. లేకుంటే పట్టించుకునే నాథుడే ఉండడు. ఇదంతా అనుభవించిన కాంతారావు తన చివరి కోరిక తిరకుండానే పై లోకాలకి వెళ్లిపోయారు.

అప్పట్లో చెన్నైలోని రాఘవాచారి రోడ్‌లో కాంతారావు కుటుంబ సభ్యులు మూడు అంతస్తుల మేడలో ఉండేవారు. ఆ ఇంటి నిండా పని వాళ్లు ఉండేవారు. అల్లు రామలింగయ్య, రాజబాబు, రాజ శ్రీ ఆయనకి క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండేవారు. ఆ సమయంలో పేదవారికి అందరికోసం కాంతారావు ఆర్థిక సహాయం చేశాడు. కాంతారావు స్వస్థలం కోదాడలోని గుడిబండ. ఆయనకు 600 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. దాంతో కొంత ధానధర్మాలకు, మరికొంత సినిమాలకు, ఇంకొంత ఆయన సరదాలకు ఖర్చు చేశారు. చివరికి అప్పుల పాలయిన కాంతారావు 1990లో ఉన్నదంతా అమ్మేసి కట్టు బట్టలతో హైదరాబాద్‌కి వచ్చారు.

ఒకరోజు హైదరాబాద్ లో వస్తాడే మా బావ అనే సినిమా అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ చూడ్డానికి ఒక అమ్మాయి తన తండ్రితో కలిసి వచ్చింది. ఆ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్న కాంతారావు ఆ అమ్మాయిని చూసి కళ్లు బాగున్నాయని ఫోటో తీయించాడు. ఆ ఫోటోలని దర్శకుడు దాసరి నారాయణరావుకి పంపించగా ఆయన ఆ ఫోటోలను చూసి అమ్మాయిని తూర్పు పడమర అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత ఆమె ఒక పెద్ద నటి అయింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్ మాధవి. హీరోయిన్ గా అయిన తర్వాత ఆ అమ్మాయి డబ్బులు బాగా సంపాదించింది.

ఆమె ఒకరోజు కాంతారావు భార్య హైమావతి కి ఫోన్ చేసి ‘ఆర్థిక సహాయం చేసే శక్తి నాకు ఉంది కానీ, నాకు మనసు రావడం లేదు. నీకు పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ‘ అని అవమానించింది. దాంతో హైమావతి బాగా కుమిలిపోయింది. కాంతారావు సహాయం చేసిన చాలామంది ఆయన్ని మర్చిపోయారు. జీవిత రాజశేఖర్ దంపతులు కూడా లక్ష రూపాయలు సహాయం ప్రకటించారు. తర్వాత మౌనంగా ఉండిపోయారు. సుబ్బిరెడ్డి లాంటివారు కాంతారావు ఉన్నప్పుడు, ఆయన మరణించిన తరువాత కూడా సహాయం చేసారు. కాంతారావు తన చివరి రోజుల్లో ‘బెల్లం చుట్టు ఈగలు అన్నట్లు.. డబ్బు ఉంటేనే సమాజంలో విలువ అని’ పదేపదే అనేవారు. ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని అందుకోవాలని ఆశపడ్డారు. తనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నారు. కానీ అవేమీ నెరవేరక ముందే కన్నుమూశారు. ప్రస్తుతం కాంతారావు కుమారులు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు.