ప్రభాస్ చిత్రంలో ఆ స్టార్ కమెడియన్..!!

టాలీవుడ్ లో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆది పురష్ సినిమా విడుదల వాయిదా పడడంతో అభిమానుల సైతం నిరుత్సాహం చెందుతున్నారు. మరోపక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరొకపక్క డైరెక్టర్ మారుతీ తో రాజా డీలక్స్ అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోని విడుదల చేస్తూ ఉండడం గమనార్హం.

Yogi Babu teams up with another pan Indian superstar after SRK? - Tamil  News - IndiaGlitz.comఈ క్రమంలో ఈ సినిమాలో కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తన షెడ్యూల్ కారణంగా యోగి భాగం హైదరాబాద్ కు వచ్చినట్లుగా సమాచారం. ప్రభాస్,యోగి బాబుకు సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా షూటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో తమిళంలో యోగి బాబు సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఇక కోలీవుడ్లో కొన్ని సినిమాలలో హీరోగా పెట్టి కూడా పలు చిత్రాలు చేశారంటే ఈనటుడికి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితంగా ప్రభాస్ సినిమాలో యోగి బాబు మంచి పాత్ర పోషిస్తూ ఉంటారని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.

Yogi Babu in Prabhas' new film?డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో డీలక్స్ సినిమాలో మలయాళం మాళవిక మోహనన్ కూడా హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. 2023 మధ్యలో ఈ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారని మేకర్స్ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఎన్నో చిత్రాలు కూడా ఒకేసారి విడుదల కాబోతుండడంతో ప్రభాస్ అభిమానులు కూడా వచ్చే ఏడాది తమ హీరో హవా కొనసాగుతుందని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest