టీడీపీ సీనియర్ చూపు..జనసేన వైపు..సీటు దక్కేనా?

ఈ మధ్య జనసేనలో కొన్ని సీట్లకు డిమాండ్ పెరిగింది..గత ఎన్నికల్లో దాదాపు 30 వేల పైనే ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు జనసేన బలం పెరిగిందనే అంచనాలకు వస్తున్నారు. ఇప్పటికే 6 శాతం ఓటు బ్యాంక్ వచ్చిన జనసేనకు ఇప్పుడు 12 శాతం వరకు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కొన్ని సీట్లలో త్రిముఖ పోరు ఉన్నా సరే జనసేన గెలుస్తుందనే ప్రచారం వస్తుంది.

అలాగే టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లని జనసేనకు కేటాయించాలి. అలా జనసేనకు కేటాయిస్తారని భావించే సీట్లపై నాయకులు ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం జనసేన నాయకులే కాదు..టీడీపీ-వైసీపీ నేతలు సైతం ఆయా సీట్లపై కన్నేస్తున్నట్లు తెలుస్తోంది. అలా జనసేనకు దక్కుతుందనుకునే సీట్లలో పిఠాపురం కూడా ఒకటి అని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి 83 వేలు, టీడీపీకి 68 వేలు, జనసేనకు 28 వేలు ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ-జనసేన మధ్య ఓట్లు చీలి వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి మాత్రం రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ నడుస్తోంది. అదే గాని జరిగితే ఈ సీటు జనసేనకు దక్కుతుందని భావిస్తున్నారు.

అందుకే ఈ సీటు కోసం కొందరు ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం ఉంది గాని..అది ఎంతవరకు నిజమవుతుందో క్లారిటీ లేదు. దీంతో ఈ సీటు కోసం కొందరు ట్రై చేస్తున్నారు. ఎలాగో జనసేనలో ఉన్న శేషుకుమారి ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో పిఠాపురం వైసీపీలో కీలకంగా ఉన్న గండేపల్లి బాబీ…కుమార్తె, అల్లుడు ఇటీవల పవన్‌ని కలిశారు. పిల్లా శ్రీధర్, దీపిక పవన్‌ని కలిశారు..పిఠాపురం సీటు కోసమే వారు పవన్‌ని కలిసినట్లు తెలిసింది.

ఇక టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం..ఇటీవల పవన్‌ని కలిశారని, ఆయన కూడా జనసేన తరుపు సీటు ఆశిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి పిఠాపురం సీటు కోసంలో జనసేనలో పోటీ పెరిగింది.