అనంతలో టీడీపీకి కష్టాలు..వైసీపీదే లీడ్!

టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇంకా వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో వైసీపీ అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే రాష్ట్ర స్థాయిలో టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుంది..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..కానీ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఇంకా వైసీపీ బలం తగ్గడం లేదు. ఇక్కడ ఇప్పటికీ వైసీపీ హవా ఉందని తెలుస్తోంది.

అనంతపురం పార్లమెంట్ పరిధిలో తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్, అనంత అర్బన్, ఉరవకొండ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క ఉరవకొండ టి‌డి‌పి గెలవగా, మిగిలిన స్థానాలు వైసీపీ గెలిచింది. ఇప్పుడు అక్కడ పరిస్తితిని చూస్తే..వైసీపీకే ఇంకా ఎడ్జ్ కనిపిస్తోంది. టి‌డి‌పి సిట్టింగ్ సీటుగా ఉన్న ఉరవకొండలో కాస్త టి‌డి‌పికే ఎడ్జ్ ఉంది గాని…వైసీపీ బాగా పికప్ అయింది. అటు తాడిపత్రిలో వైసీపీకి ధీటుగా టి‌డి‌పి బలపడింది. ప్రస్తుతానికి అక్కడ టి‌డి‌పికి ఎడ్జ్ కనిపిస్తోంది. అనంత అర్బన్ స్థానంలో వైసీపీకి టి‌డి‌పి గట్టి పోటీ ఇస్తుంది. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది.

ఇక శింగనమల స్థానంలో వైసీపీకే ఆధిక్యం ఉంది..ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి కష్టపడుతున్నారు గాని..టీడీపీలో ఉండే కొందరు నేతలు ఆమెని వెనక్కి లాగుతున్నారు. అటు గుంతకల్ సీటులో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉంది. ఇక్కడ టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. రాయదుర్గంలో స్వల్ప ఆధిక్యంలో వైసీపీ కనిపిస్తుంది గాని..టి‌డి‌పి బాగా పికప్ అయింది.

కళ్యాణదుర్గం స్థానంలో కూడా కొంచెం ఎడ్జ్ వైసీపీకే కనిపిస్తోంది..కాకపోతే టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఇబ్బందిగా మారాయి. కానీ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది..వైసీపీపై వ్యతిరేకత కలిసొచ్చే అంశం. ఓవరాల్ గా చూసుకుంటే అనంత పార్లమెంట్‌లో వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. గ్రూపు తగాదాలు, వైసీపీపై వ్యతిరేకతని ఉపయోగించుకుంటే టి‌డి‌పి ఆధిక్యం దక్కించుకోవచ్చు.