1985 తర్వాత కోడుమూరులో పసుపు గాలి..!

రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయనే విషయం తెలిసిందే..అయితే వైసీపీకి 175 స్థానాల్లో బలమైన నాయకత్వం ఉంది..కానీ టీడీపీకి ఆ పరిస్తితి లేదు..కొన్ని స్థానాల్లో టీడీపీ పెద్దగా పోటీ ఇవ్వలేదు..మొదట నుంచి అదే పరిస్తితి..ఆ స్థానాలని టీడీపీ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు..అంటే అలాంటి చోట్ల పోటీ చేస్తే గెలుపుపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా గెలుపుపై ఆశలు లేని స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు కూడా ఒకటి. అసలు ఈ నియోజకవర్గం కూడా ఒకటి ఉందా? అనేది టీడీపీ కార్యకర్తలకే తెలియదు.

అంటే ఆ సీటులో టీడీపీ గెలిచింది ఒక్కసారి మాత్రమే…అది కూడా ఎన్టీఆర్ వేవ్‌లో 1985లో గెలిచింది. అసలు ఈ స్థానంలో కాంగ్రెస్ అభిమానులు ఎక్కువ. ఎస్సీ రిజర్వడ్‌గా ఉన్న ఈ స్థానంలో టీడీపీకి బలం తక్కువ. కొంత క్యాడర్ ఉంటుంది గాని..గెలిచెంత బలం మాత్రం లేదు. 1983, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అంటే ఇన్నేళ్లలో కేవలం ఒక్కసారే కోడుమూరులో గెలిచింది.

కాంగ్రెస్ తర్వాత అక్కడి ప్రజలు వైసీపీని ఆదరించడం మొదలుపెట్టారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది..కాకపోతే 2014లో వైసీపీ నుంచి గెలిచిన మణిగాంధిని టీడీపీ తీసుకుంది..ఆ తర్వాత అయిన పార్టీ రాత మారుతుందని అనుకున్నారు..కానీ మారలేదు. 2019 ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఓడిపోయింది. అలా వరుస ఓటములే టీడీపీని పలకరించాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే..కాంగ్రెస్ నుంచి గాని, వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోయినా, ఆ పార్టీలనే ఆదరించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్..ఇక్కడ గొప్పగా చేస్తుందేమీ లేదు. అభివృద్ధి లేదు..ఆ పథకాలు మాత్రం వస్తున్నాయి. ప్రజా సమస్యలు పట్టించుకోవడం తక్కువ. అయినా సరే ఇక్కడ వైసీపీ వైపే జనం ఉన్నారు.

కాకపోతే టీడీపీ ఇంచార్జ్ గా వచ్చిన ఆకెపోగు ప్రభాకర్..ఈ మధ్య దూకుడుగా పనిచేస్తున్నారు..కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సపోర్ట్‌తో కోడుమూరులో టీడీపీ బలం పెంచుతున్నారు..తాజాగా చంద్రబాబు పర్యటనతో కోడుమూరు టీడీపీకి ఊపు వచ్చింది. కోడుమూరులో బాబు పర్యటనకు భారీగా జనం వచ్చారు. ఇదే ఊపు కొనసాగించి..ఇంకా బలం పెంచుకుంటే కోడుమూరులో టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగు పడతాయి.

Share post:

Latest